ఆగస్టులో రానున్న జెండా పై కపిరాజు

ఆగస్టులో రానున్న జెండా పై కపిరాజు

Published on Feb 6, 2013 11:06 PM IST

Jendapai Kapi Raju
యంగ్ హీరో నాని హీరోగా రానున్న సోషియో డ్రామా సినిమా ‘జెండా పై కపిరాజు’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. నాని, అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సంబందించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుందనే థీమ్ కూడా ఉండనుంది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాని మొదటి సారి డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్. నాని ప్రస్తుతం ఈ సినిమా కాకుండా కృష్ణవంశీ డైరెక్షన్లో ‘పైసా’, అలాగే ‘బ్యాండ్ బజా భారత్’ రీమేక్లో నటిస్తున్నాడు.

తాజా వార్తలు