పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక పవన్ నెక్స్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే వస్తుండటంతో ఆ రోజున అభిమానులను థ్రిల్ చేసేందుకు ఏయే అప్డేట్స్ వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
కాగా, ఇప్పటికే రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుండటంతో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రాన్ని బర్త్ డే ట్రీట్‌గా ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు పవన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జల్సా’ చిత్రాన్ని కూడా రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న ఈ సినిమాను పవన్ బర్త్ డే ట్రీట్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.