యాక్షన్ కింగ్ అర్జున్ చాలా కాలం తర్వాత ఓ సినిమాకి డైరెక్ట్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికి అర్జున్ 10 సినిమాలకు దర్శకత్వం వహించాడు అన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి అందులో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా ‘జై హింద్’. తాజాగా అర్జున్ దర్శకత్వం వహించనున్న ‘జై హింద్ 2’ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది. అర్జున్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సొంత నిర్మాణ సంస్థలో 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నాడు. సుర్వీన్ చావ్లా హీరోయిన్ గా నటించనుంది.
అర్జున్ ఈ విశేషాల గురించి చెబుతూ ‘ ‘జై హింద్ 2’ సినిమా నా గత సినిమాలకు సీక్వెల్/ఫ్రీక్వెల్ కాదు. ఈ సినిమా ఎపిజె అబ్దుల్ కలాం గారికి ట్రిబ్యూట్. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ మీద, అందులోని లోపాల మీద ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా అబ్దుల్ కలాం గారి కల ‘అందరూ చదువుకోవాలి, ఇండియాకి సూపర్ పవర్ దేశం గా మారాలి’ అన్నదాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని’ అన్నాడు.