పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి కూడా సాలిడ్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇండియా, యూఎస్ తదితర దేశాలలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అయ్యింది.
ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ డిసెంబర్ 12న అక్కడ రిలీజ్ చేసేందుకు లాక్ చేశారు. కానీ డిసెంబర్ 5న ప్రీమియర్ ఉండగా దానికి ప్రభాస్ ఇంకా నిర్మాత శోభు యార్లగడ్డ హాజరు కానున్నారట. అయితే ప్రభాస్ కి జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో తాను కల్కి 2898 ఎడి రిలీజ్ కి అక్కడికి వెళ్లడం కుదరకపోతే తాను డెఫినెట్ గా మరోసారి వస్తానని తెలిపారు. కానీ అది బాహుబలి ది ఎపిక్ కి కుదిరింది. దీనితో ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
