చాలాకాలం విరామం తర్వాత శివబాలాజీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రవితేజ, అల్లరి నరేష్ తో కలిసి ‘శంభో శివ శంభో’ సినిమాలో నటించిన మన హీరో ప్రస్తుతం ‘జగమే మాయ’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో శివబాలాజీతో పాటు గజాల్ సోమయ్య, సిద్ధు, క్రాంతి మరియు చిన్మయి నటిస్తున్నారు. మహేష్ ఉప్పుటూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా యొక్క లోగోను హైదరాబాద్లో విడుదల చేసారు. శ్రీహరి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈవేడుకలో భీమినేని శ్రీనివాసరావు, వి. సముద్ర కూడా హాజారయ్యారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా శ్రీ సాయి తిరుమల బ్యానర్ పై విడుదలకానుంది.