సమీక్ష: జాకీచాన్ ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ – డిజప్పాయింట్ చేసే యాక్షన్ డ్రామా

Katare Kid: Legends Movie Review

విడుదల తేదీ : మే 30, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : జాకీ చాన్, బెన్ వాంగ్, జాషువా జాక్, కుమారుడు సాడీ స్టాన్లీ, మింగ్-నా వెన్, వ్యాట్ ఒలెఫ్, అరామిస్ నైట్, రాల్ఫ్ మాచియో మరియు ఇతరులు
దర్శకత్వం : జోనాథన్ ఎంట్విజిల్
నిర్మాణం : కరెన్ రోసెన్‌ఫెల్ట్
సంగీతం : డొమినిక్ లూయిస్
ఛాయాగ్రహణం : జస్టిన్ బ్రౌన్
కూర్పు : డానా ఇ. గ్లాబెర్‌మాన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హాలీవుడ్ ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీచాన్ నటించిన సూపర్ హిట్ ఫ్రాంచైజ్ లలో కరాటే కిడ్ కూడా ఒకటి. అయితే ఎప్పుడో 2010 తర్వాత మళ్ళీ వస్తున్న ఈ సరికొత్త ఇన్స్టాల్మెంట్ కరాటే కిడ్ లెజెండ్స్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

బీజింగ్ లో లీ ఫాంగ్ (బెన్ వాంగ్) ఒక ట్రెడిషినల్ కంగ్ ఫూ మాస్టర్ సీఫు హాన్ (జాకీచాన్) దగ్గర కంగ్ ఫూశిక్షణ పొందుతూ ఉంటాడు. అయితే తన తల్లి లీ ని తీసుకొని న్యూయార్క్ కి షిఫ్ట్ అయ్యి బెటర్ లైఫ్ ని గడపాలని ప్లాన్ చేసుకుంటుంది. అయితే లీ బెస్ట్ ఫ్రెండ్ మియా (సడీ స్టాన్లీ) అలాగే ఆమె తండ్రి ఏవో కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. మరి ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? లీ మళ్ళీ బీజింగ్ కి వస్తాడా లేదా? తన మాస్టర్ హాన్ పరిస్థితి ఏంటి? ఈ మార్షల్ ఆర్ట్స్ డ్రామా ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మార్షల్ ఆర్ట్స్ సంబంధించి సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ లు ఇష్టపడే ఆడియెన్స్ కి ఈ చిత్రంలో కొన్ని చోట్ల మూమెంట్స్ మంచి ట్రీట్ గా అనిపిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ సినిమాలో బాగుంది.

అలాగే టోర్నమెంట్ ని ముందు జరిగే ట్రైనింగ్ ఎపిసోడ్ కూడా మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా జాకీచాన్ ఉన్నంత సేపు సినిమా చూడదగే విధంగా సాగింది అని చెప్పవచ్చు. తనపై ఉన్న సీన్స్ అన్నీ బాగున్నాయి. అలాగే తన పాత్రలో కావాల్సిన వెయిట్ కూడా కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ కరాటే కిడ్ ఫ్రాంచైజ్ కోసం మినిమమ్ ఐడియా ఉన్నవారు అయినా కూడా ఈ సినిమాతో మట్టం డిజప్పాయింట్ అయ్యే తీరుతారని చెప్పక తప్పదు. మెయిన్ గా ఈ సినిమాలో అసలు సరైన ఎమోషన్స్ లేవు. ఒక బలమైన పాయింట్ ఎమోషన్ తో కొనసాగే అంశం ఈ సినిమాలో లోపించింది.

గతంలో వచ్చిన జేడెన్ స్మిత్ కరాటే కిడ్ లో యాక్షన్ తో పాటుగా అంతే సమపాళ్లలో ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇది ఇందులో బాగా మిస్ అయ్యింది. అలాగే ఇంకా బాగా డిజప్పాయింట్ చేసే అంశం జాకీచాన్ అభిమానులకి అని చెప్పక తప్పదు.

జాకీచాన్ ఈ సినిమాలో చాలా కీలకం అలాంటిది తన రోల్ సినిమాలో ఇంకొంచెం ఎక్కువసేపు కనిపించేలా డిజైన్ చేస్తే బాగుణ్ణు. అలాగే మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ కూడా అంతేమి లేదు. ఇంకొన్ని పాత్రలు డెవలప్మెంట్ బాలేదు. ఇలా సినిమా మాత్రం బాగా డల్ గానే సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్రాంచైజ్ కి తగ్గ రేంజ్ లోనే సాలిడ్ గా ఉన్నాయి. టెక్నికల్ టీం లో జస్టిన్ బ్రౌన్ కెమెరా వర్క్ అదిరింది అని చెప్పొచ్చు. ఫైట్ సీక్వెన్స్ లని తాను బాగా చిత్రీకరించారు. డామినిక్ లెవిస్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగానే ఉంది. తెలుగు డబ్బింగ్ మాత్రం బాలేదు. యాక్షన్ పార్ట్ ఎపిసోడ్స్ ని బాగా డిజైన్ చేశారు. ఇక దర్శకుడు జోనాథన్ ఎంట్విజిల్ విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి అంతగా మెప్పించలేదు. ఈ మార్షల్ ఆర్ట్స్ ఫ్రాంచైజ్ సినిమాల్లో మరో మంచి సినిమాగా దీన్ని మలచడంలో తాను విఫలం అయ్యారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కరాటే కిడ్ – లెజెండ్స్” ఈ ఫ్రాంచైజ్ కి ఉన్న హైప్ ని అందుకోవడం విఫలం అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ గా ఈ చిత్రం ఏమాత్రం మెప్పించలేదు. ఫిలాసఫికల్ డెప్త్, కథనం లాంటివి సినిమాలో చాలా బలహీనంగా ఉన్నాయి. కేవలం కొన్ని సీన్స్ తప్పితే ఈ సినిమా అంత మెప్పించదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version