అడ్వెంచర్ ఫిల్మ్ తో రానున్న జె.డి చక్రవర్తి

అడ్వెంచర్ ఫిల్మ్ తో రానున్న జె.డి చక్రవర్తి

Published on May 2, 2013 7:02 PM IST

JD-Chakravarthi
యాక్టర్ జె.డి చక్రవర్తి మరో కొత్త సినిమాకి దర్శకత్వం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. గతంలో అతను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరజయాన్నే చవి చూసింది అలా అని అతను ఆపకుండా ఈ సారి ఎంటర్టైన్మెంట్ కలగలిపిన అడ్వెంచర్ ఫిల్మ్ తో మనముందుకు రానున్నాడు. ఈ సినిమాని జె.డి చక్రవర్తి కొత్త వాళ్ళతో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొత్త వాళ్ళతో సినిమా తీయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళైతే ఫ్రెష్ ఫీల్ ఇవ్వగలరు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రీన్ ప్లే మరికొన్ని విభాగాలపై వర్క్ చేస్తున్నామని’ జె.డి చక్రవర్తి అన్నాడు. శ్రీ విగ్నేష్ కార్తీక్ మూవీస్ – చక్రవర్తి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు