అలా చెయ్యడం చాలా ఇబ్బంది – హరీష్ శంకర్

Harish-Shankar1
మాస్ మహారాజ రవితేజ తో ‘మిరపకాయ్’ తీసి సూపర్ హిట్ అందుకున్న మాస్ డైరెక్టర్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసే చాన్స్ కొట్టేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘రామయ్యా.. వస్తావయ్యా’ అనే సినిమా చేస్తున్నాడు. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తన గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ సారి నెమరు వేసుకున్నాడు.

‘ నేను తీసిన ‘షాక్’ సినిమా ఫ్లాప్ అవడంతో బాగా నిరాశకి గురయ్యాను. రవితేజ, ఎంఎస్ రాజు సినిమా చెయ్యమని చాన్స్ ఇచ్చినా చెయ్యలేను అని చెప్పేసాను. అప్పటి నుండి నా ఆలోచనలు, వ్యక్తిత్వం మారింది. ఆ తర్వాత పూరి గారి దగ్గర రైటర్ గా చేరాను. డైరెక్టర్ గా సినిమా చేసి మరో డైరెక్టర్ దగ్గర రైటర్ గా చెయ్యడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కెరీర్లో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో పనిచేసాను. ఆయన దగ్గర పని చేసిన 4 సంవత్సరాల్లో ఎన్నో నేర్చుకొని ఆ తర్వాత డైరెక్టర్ గా సక్సెస్ అయ్యానని’ హరీష్ శంకర్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

Exit mobile version