సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటున్న టాలీవుడ్

సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటున్న టాలీవుడ్

Published on Feb 5, 2012 12:49 PM IST

‘కొలవేరి డి’ పాట బాగా హిట్ కావడంతో అదే బాటలో మరికొన్ని వస్తున్నాయి. నిర్మాతలు కూడా ఈ తరహా పబ్లిసిటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్లో వ్యవహారాలు ఎక్కువ కావడంతో సినిమా పబ్లిసిటీ కూడా ఇక్కడినుండి మొదలు పెడుతున్నారు. సిద్ధార్థ్ నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాకి పేస్ బుక్ లో 10,000 లైక్స్ పడ్డాయి. ట్రైలర్స్ కూడా యూట్యూబ్ లో పెట్టడంతో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. తెలుగు నిర్మాతలు కూడా సినిమా ప్రమోషన్ కోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ పై ఆధారపడటం ఆసక్తికరం.

తాజా వార్తలు