ఆర్ ఆర్ ఆర్ వాయిదాతో బన్నీ రికార్డ్స్ సేఫ్

ఆర్ ఆర్ ఆర్ వాయిదాతో బన్నీ రికార్డ్స్ సేఫ్

Published on Feb 10, 2020 7:04 AM IST

అల వైకుంఠపురంలో మూవీ బన్నీకి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ లో మూడవ స్థానంలో నిలవడంతో పాటు, నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల ఇంకా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. కాగా 2020కి బన్నీ సినిమా రికార్డ్స్ అధిగమించడం ఏ హీరోకైనా అంత ఈజీ కాదు.

ఐతే ఆర్ ఆర్ అనుకున్న ప్రకారం ఈ ఏడాది జులై 30న విడుదల అయినట్లైతే ఖచ్చితంగా బన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేవి. ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ అల వైకుంఠపురంలో రికార్డ్స్ అధిగమించి నాన్ బాహుబలి రికార్డ్స్ లేదా దానికి మించిన రికార్డ్స్ నమోదు చేసేది. కానీ ఆర్ ఆర్ ఆర్ ఏకంగా 2021జనవరి 8కి వాయిదాపడింది. కాబట్టి అల వైకుంఠపురంలో రికార్డ్స్ సేఫ్ అని చెప్పాలి. ఇక ఈ ఏడాది పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ అలాగే ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ కూడా విడుదల కానుంది. బహుశా ఈ రెండు చిత్రాలలో ఏదో ఒకటి బన్నీ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది.

తాజా వార్తలు