రామాయణం తీసే ఆలోచన రాజమౌళికి లేనట్టే

సబ్జెక్టు ఏదైనా రాజమౌళి డీల్ చేస్తే వెండితెరపై పండాల్సిందే. ఆయన ఇప్పటివరకు యూత్ ఫుల్ సబ్జక్ట్స్ నుండి ఫాంటసీ, పీరియాడిక్ మరియు మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్స్ అన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ హిస్టారిక్ పాత్రలకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్… కొమరం భీమ్, అల్లూరి పాత్రలు చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. ఇక రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని ఆయన అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఆ సినిమా తీయడానికి ప్రస్తుత నా అనుభవం చాలదని బాహుబలి చిత్రానికి ముందు చెప్పారు.

ఐతే ఆయన రామాయణం తీయాలని సోషల్ మీడియా వేదికగా ఓ డిమాండ్ వినిపిస్తుంది. ఈ మధ్య దీనిపై ట్విట్టర్ లో యాష్ ట్యాగ్ తో ట్రెండ్ కూడా చేశారు. ఐతే తనకు రామాయణం పై ఎందుకు ఆసక్తి లేదో రాజమౌళి చెప్పారు. రాముడు మంచి వారు మరియు సాఫ్ట్ నేచర్ కలిగి ఉండడం వలన ఓ మాస్ హీరోకి ఉండే క్వాలిటీస్ ఆయనకు లేవు అన్నారు. కృష్ణుడు విషయంలో హీరోయిన్ ఇజం ఎలివేషన్ చేసుకోవచ్చు అన్నారు. కారణం ఏదైనా రాజమౌళి మాత్రం రామాయణం తీయను అని ప్రత్యక్షంగా చెప్పేశారు. కాబట్టి ఆయన నుండి రామాయణం రాకపోవచ్చు.

Exit mobile version