మహేష్ బాబుతో పనిచేయడం గొప్ప అనుభవం – సోఫీ చౌదరి

sophie_chaudhary
సినీ ప్రపంచంలో మెలోడియస్, ఫాస్ట్ బీట్, రొమాంటిక్, సెంటిమెంట్ సాంగ్స్ ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంది. మన తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ మంచి క్రేజ్ ఉంది. అదీ కొంతమంది డైరెక్టర్స్ – మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబినేషన్లో అంటే క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లలో ఒకటి సుకుమార్ – దేవీశ్రీ ప్రసాద్ లది. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ఈ సినిమా కోసం దేవీ ‘లండన్ బాబు’ ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసాడు.

ఈ పాటలో లండన్ భామ అయిన సోఫీ చౌదరి మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసింది. సోఫీ చౌదరి మహేష్ బాబుతో పనిచేయడం గురించి చెబుతూ ‘మహేష్ బాబుతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. నాకు చాలా ఆనందంగా ఉంది. 1 టీంతో పనిచేయడం కూడా బాగుందని’ చెప్పింది.

కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమా జనవరి 10న భారీ ఎత్తున విడుదల కానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిమించిన ఈ స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ లో మహేష్ బాబు ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

Exit mobile version