సెన్సార్ పూర్తి చేసుకున్న ఇష్క్


యువ నటుడు నితిన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇష్క్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజే పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి గాను యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కార్యక్రమాలతో మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ఈ నెల 24 న విడుదలకు సిద్ధమవుతుంది. నితిన్ ఈ చిత్రం విజయం సాధిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నిత్య మీనన్ హీరొయిన్ గా నటించింది.

Exit mobile version