ప్రభాస్ యుద్ధ వీరుడిగా… ప్రభాస్ 21 స్టోరీ లైన్..?

ప్రభాస్ యుద్ధ వీరుడిగా… ప్రభాస్ 21 స్టోరీ లైన్..?

Published on Jul 23, 2020 9:14 AM IST

ప్రభాస్ తన 21వ చిత్రం మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ పాన్ ఇండియాకు మించిన పాన్ వరల్డ్ మూవీ అని దర్శకుడు స్వయంగా తెలియజేయడంతో, మూవీ రేంజ్ మనం ఊహిస్తున్న దానికి కన్నా పెద్దదని అర్థం అవుతుంది. ఇక హీరోయిన్ గా దీపిక పదుకొనె ను తీసుకోవడంతో ఈ మూవీ స్కేల్ పై మరింత స్పష్టత వచ్చింది. దీనితో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ ఓ భారీ విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతుంది. కాగా ఈ మూవీ స్టోరీ లైన్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

ప్రభాస్ 21 మూవీ కథ ఓ ఫిక్షనల్ వార్ డ్రామా అని తెలుస్తుంది. మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. ప్రభాస్ యుద్ధవీరుడిగా కనిపిస్తాడని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాతల ఆలోచన.2021లో నిరవధికంగా షూటింగ్ జరిపి, 2022లో విడుదల చేయనున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు