‘ది రాజా సాబ్’ ఆలస్యానికి అదే కారణమా..?

‘ది రాజా సాబ్’ ఆలస్యానికి అదే కారణమా..?

Published on Mar 9, 2025 2:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంది. అయితే, ఈ సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. కానీ, చిత్ర యూనిట్ ఓ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్‌పై ఇప్పటికే మూడున్నర గంటల సినిమా ఉందని తెలుస్తోంది. హార్రర్ కామెడీ జోనర్ చిత్రాలకు ఇంత భారీ రన్‌టైమ్ వర్కవుట్ కాదు. దీంతో ఈ సినిమా ఎడిటింగ్ విభాగం తలలు పట్టుకుని మరీ ఏయే సీన్స్ ట్రిమ్ చేయాలా.. అనే డైలమాలో ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి నిజంగానే ‘ది రాజాసాబ్’ ఆలస్యానికి ఇదే కారణమా.. లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది కూడా తెలియాలి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు