పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా ఓ పీరియాడిక్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. లాక్ డౌన్ కి ముంది దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారని సమాచారం. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.
పవన్ ఈ చిత్రంలో బొందిపోటు పాత్ర చేస్తున్నారు. అలాగే ఆ పాత్ర పేరు వీర అని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక ఈ పీరియాడిక్ మూవీలో జాక్వీలిన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కాగా పవన్ వకీల్ సాబ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.