ఐశ్వర్య రాయ్ కూతురి పేరు ఇదేనా?

ఐశ్వర్య రాయ్ కూతురి పేరు ఇదేనా?

Published on Mar 14, 2012 1:52 PM IST


బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురికి ‘ఆరాధ్య’ అనే పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ వార్తను ప్రముఖ వార్తా పత్రిక కూడా ఇదే అసలైన పేరు అంటూ ప్రచురించింది. బచ్చన్ కుటుంబం ఆ పాపను మీడియా కంట పడకుండా కాపాడుతూ వచ్చింది. బేటి బి, అభిలాష అని పలు పేర్లు వినిపించినప్పటికీ ఇదే పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలో బచ్చన్ కుటుంబం ఆరాధ్యను అందరికీ చూపిస్తారని ఆశిద్దాం.

తాజా వార్తలు