ఆ స్టార్ హీరో సినిమాలో కార్తికేయ విలన్ రోల్ ఖాయమేనా..!

ఆ స్టార్ హీరో సినిమాలో కార్తికేయ విలన్ రోల్ ఖాయమేనా..!

Published on May 1, 2020 9:42 PM IST

యంగ్ హీరో కార్తికేయ గత ఏడాది మూడు చిత్రాలు విడుదల చేశారు. హిప్పీ, గుణ 369 మరియు 90 ఎం ఎల్ సినిమాలు ఆయన నుండి వచ్చాయి. ఐతే వాటిలో గుణ 369 మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక ఆయన నెక్స్ట్ మూవీ చావు కబురు చల్లగా షూటింగ్ మొదలైంది. కాగా కార్తికేయ తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారంటూ ఎప్పటి నుండో ఓ వార్త ప్రచారం అవుతుంది.

ఐతే అది నిజమే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు అజిత్ పుట్టినరోజు కావడంతో కార్తికేయ ట్విటర్ లో ప్రత్యేకంగా విషెష్ తెలిపారు. అలాగే ఆయన ఫస్ట్ ట్వీట్ లో బర్త్ డే ట్యాగ్ రాంగ్ వేశానని సారీ చెప్పారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ వాళమై అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కర్తకేయ విలన్ గా చేసే అవకాశం కలదు. ఇప్పటికే చాల వరకు ఈ చిత్ర షూటింగ్ పూరి కాగా త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు