మోహన్ లాల్ “లూసిఫర్ 2” కి ప్లాప్ సెంటిమెంట్ కలిసొస్తుందా?

మోహన్ లాల్ “లూసిఫర్ 2” కి ప్లాప్ సెంటిమెంట్ కలిసొస్తుందా?

Published on Feb 1, 2025 1:11 PM IST

రీసెంట్ గానే మళయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం “బరోజ్” తో పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మోహన్ లాల్ కెరీర్ లో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి అన్ని అంచనాలు అవైటెడ్ సీక్వెల్ చిత్రం “లూసిఫర్ 2” మీదే ఉన్నాయి. మళయాళంలో భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం అప్పట్లో తెలుగులో కూడా డబ్ అయ్యింది.

మళ్ళీ దానిని మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్” అంటూ రీమేక్ చేశారు. అయితే ఇపుడు దీనికి సీక్వెల్ గా ఎంపురాన్ అంటూ దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక సాలిడ్ బజ్ ని అందుకుంది. అయితే ఈ సినిమాతో మోహన్ లాల్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

మరి లాస్ట్ గా వచ్చిన సినిమా బరోజ్ డిజప్పాయింట్ చేయడంతో ఇపుడు ఓ సెంటిమెంట్ మోహన్ లాల్ లూసిఫర్ 2 ని సేవ్ చేస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇదే పృథ్వీ రాజ్ సుకుమారన్ తో చేసిన లూసిఫర్ 1 కి ముందు వచ్చిన సినిమా “ఒడియన్” భారీ హైప్ సెట్ చేసుకుంది కానీ వాటిని రీచ్ కాలేకపోయింది.

ఇక ఈ తర్వాత మరక్కర్ డిజప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ పృథ్వీతో చేసిన “బ్రో డాడీ” సూపర్ హిట్ అయ్యింది. ఇక ఫైనల్ గా బరోజ్ ప్లాప్ తర్వాత మళ్ళీ పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రెజెన్స్ ఉన్న ఎంపురాన్(లూసిఫర్ 2) రాబోతుంది. దీనితో ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని మోహన్ లాల్ అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ మార్చ్ 27న రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు