పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా అభిమానులు పవన్ వారసుడు అకిరా నందన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడని బలంగా నమ్ముతున్నారు. ఓజి ఫస్ట్ సాంగ్ నుంచే మంచి హింట్స్ కనిపించాయని కొన్ని డిజైన్స్ చూసి పసిగట్టారు.
అయితే అకిరా ఉన్నాడో లేదో అనేది పక్కన పెడితే మరో హింట్ తన ప్రెజెన్స్ పై వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఓజి గేమ్ ఒకటి ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. మరి అందులో ఒక కత్తిలో ఓ యంగ్ కుర్రాడి కళ్ళు కనిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వి అయితే కాదు. కానీ బాగా గమనిస్తే అవి అకిరా కళ్ళు లా ఉన్నాయి అని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనితో సినిమాలో తాను కూడా ఉన్నాడు అనే మాట ఇపుడు మరోసారి వైరల్ అవుతుంది మరి ఇది ఎంత వరకు నిజం అనేది రేపటితో తేలిపోతుంది.