“సర్కారు వారి పాట” ప్లానింగ్ మారనుందా?

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుండగా మరో పక్క ఈ చిత్రం పై మరో బజ్ కూడా వినిపిస్తుంది. మహేష్ నుంచి ఒక పాన్ ఇండియన్ చిత్రం విడుదల అయితే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

కానీ మహేష్ ఇన్నాళ్లయినా సరే తన స్టార్డం ను కేవలం మన వరకు మాత్రమే ఉపయోగించారు అని ఫీలయ్యే మహేష్ అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. అందుకే ఒక సరైన పాన్ ఇండియన్ ఎంట్రీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అది ఇప్పుడు సర్కారు వారి పాట తోనే తీరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. చిత్ర యూనిట్ ఇంకా దీనిపై తుది నిర్ణయానికి అయితే రాలేదు కానీ జస్ట్ ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ బజ్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Exit mobile version