అక్కినేని సమంత పెట్టిన ఓ ఇన్స్టా గ్రామ్ పోస్ట్ ఆధారంగా ఓ ప్రచారం టాలీవుడ్ లో మొదలైంది. సమంత పెట్టిన ఆ పోస్ట్ అత్తగారైన అమలను ఉద్దేశించే అని కొందరు అంటున్నారు. విషయంలోకి వెళితే సమంత తాను చేసిన వంటకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఐతే కొద్దిరోజుల క్రితం అమల ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా సమంతకు వంట రాదని, నాగార్జున బాగా వంట చేస్తారని..ఇంకా ఎవరూ వండాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా సమంత ఇన్స్టా గ్రామ్ లో తన వంటకు సంబందించిన పోస్ట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఈనెల 8న అఖిల్ పుట్టిన రోజు జరుపుకోగా, చైతూ మరియు సమంత కనీసం సోషల్ మీడియాలో కూడా విషెష్ చెప్పలేదు. ఇవన్నీ గమనిస్తుంటే ఏదో విషయమై అమలకు, సమంతకు మధ్య మనస్పర్థలు నడుస్తున్నాయని మీడియా విశ్లేషిస్తుంది.