రాజమౌళి హైదరాబాద్ వెకేట్ చేశారా?

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రముఖులు నుండి సామాన్యుల వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొందరు హైదరాబాద్ విడిచి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. కాగా దర్శకుడు రాజమౌళి సైతం హైదరాబాద్ వీడి బయటికి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన రాజమౌళి హైదరాబాద్ కి దూరంగా ఉన్న తన ఫార్మ్ హౌస్ కి కుటుంబంతో పాటు వెళ్లారని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ఇక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు పెట్టాలని ఓ భారీ సెట్ సిద్ధం చేయించి కూడా మధ్యలో ఆగిపోయారు. కరోనా వైరస్ కారణంగానే ఆయన షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి సుముఖత చూపడం లేదు. దీనితో ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం కానుందని ప్రచారం జరుగుతుంది.

Exit mobile version