మన ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బెస్ట్ హారర్ చిత్రాల్లో మరాఠి చిత్రం “తుంబాడ్” ఆల్ టైం టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. టెక్నీకల్ గా గాని కంటెంట్ పరంగా కానీ పీక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుండడంతో దీనిపై పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కిస్తున్న ఈ హారర్ చిత్రంపై కొన్ని రోజులు నుంచి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ గా వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఏక్ నిరంజన్ బ్యూటీ కంగన రనౌత్ నటించనున్నట్టుగా తెలుస్తుంది. 2026లో స్టార్ట్ కానున్న ఈ సినిమాలో ఆమె కూడా జాయిన్ అవుతుంది అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.