ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుంచి ఉన్న స్టార్ హీరోస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ వచ్చే ఏడాది మార్చ్ 27 డేట్ కి ఫిక్స్ చేశారు. దానికి ముందు రోజు ది ప్యారడైజ్ కూడా ఉంది.
ఇదే పెద్ద క్లాష్ అనుకుంటే ఇప్పుడు రేస్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నట్టు పలు రూమర్స్ వస్తున్నాయి. నిజానికి మేకర్స్ ఏప్రిల్ రిలీజ్ అని ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మార్చ్ చివరి వారంలో అంటూ రూమర్స్ స్పెక్యులేట్ అవుతున్నాయి. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ కి పెద్ది సినిమాకి క్లాష్ పడుతుంది అని గట్టి వార్తలు మొదలయ్యాయి.
కానీ గ్రౌండ్ రియాలిటీలో ఈ రెండు సినిమాలు క్లాష్ కి రావడం అనేది జరగని పని. బాక్సాఫీస్ పరంగా చూసుకున్నా రెండిటికి ఎఫెక్ట్ అనేది పక్కన పెడితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు హీరోలూ పైగా రెండు ఒకే నిర్మాణ సంస్థల నుంచే ఉన్నాయి కాబట్టి ఈ సినిమా సినిమాల క్లాష్ అనేది గాలి మాటే అని చెప్పవచ్చు. సో ఇందులో ఎలాంటి నిజం లేదనే అనుకోవాలి.


