నార్త్ లో పెరుగుతున్న ‘ఓజి’ షోస్?

నార్త్ లో పెరుగుతున్న ‘ఓజి’ షోస్?

Published on Sep 27, 2025 8:07 AM IST

OG-Stills

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. ఇక నెక్స్ట్ సినిమా మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటుండగా ఈ సినిమా ఎలాంటి సరైన ప్లానింగ్ లేకుండా సైలెంట్ గానే తెలుగు మినహా ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది.

మరి ఇలా తెలుగు తప్ప మిగతా భాషల్లో పెద్ద చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ అందుకోని ఈ సినిమా నెమ్మదిగా హిందీ మార్కెట్ లో మాత్రం గ్రోత్ కనబరుస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. నార్త్ ఇండియా మార్కెట్ లో ఓజి షోస్ క్రమంగా పలు చోట్ల పెరుగుతున్నాయట. అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు నార్త్ ఇండియా ఆడియెన్స్ ఓజి షోస్ చూసిన వారి నుంచి కూడా వైరల్ అవుతున్నాయి. మరి హిందీలో ఓజి నిజంగానే పుంజుకుంటుందా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు