ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?

ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?

Published on Sep 10, 2025 3:03 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత నెక్స్ట్ లెవెల్ హైప్ తో వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అందులోని పవన్ వీరాభిమాని సుజీత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ చిత్రం ఆల్రెడీ రికార్డు ప్రీమియర్స్ తో దూసుకెళ్తుంది. మరి మేకర్స్ ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ లేటెస్ట్ గా మరో భాష కూడా ఇందులో యాడ్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఓజి సినిమాకి కన్నడ వెర్షన్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లోనే ఉన్నట్టుగా ఇపుడు టాక్. ఇక దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు