ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు సిద్ధం అవుతుండగా వీటిలో ఓ క్రేజీ కలయిక ఉంటుంది అని ఇపుడు టాక్ వినిపిస్తుంది.
అయితే బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఎంట్రీతో పాటుగా మరో సినిమాలో బాలయ్య, మోక్షజ్ఞ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇపుడు అదే సాధ్యం అయ్యేలా ఉందని తెలుస్తుంది. బాలయ్యతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలోనే మోక్షజ్ఞ కూడా కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.