‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని తెరక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం జాన్వీ కపూర్ షూట్ లో జాయిన్ కానుంది అని తెలుస్తోంది. అన్నట్టు పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనుంది. ఐతే, ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారికంగా అప్ డేట్ రాలేదు.
కాగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో అల్లు అర్జున్ లుక్ అండ్ యాక్షన్ ది బెస్ట్ అంటూ చెబుతున్నారు. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి.


