ఆంధ్ర ప్రదేశ్ లో ఐరన్ మాన్ కి ఫుల్ క్రేజ్.!

ఆంధ్ర ప్రదేశ్ లో ఐరన్ మాన్ కి ఫుల్ క్రేజ్.!

Published on Apr 25, 2013 3:00 PM IST

Iron-Man-3
హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ దౌనీ నటించిన ‘ఐరన్ మాన్ – 3’ మూవీ రేపు అనగా ఏప్రిల్ 26 న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాకి క్రేజ్ చాలా హైగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలాగే ఈ మూవీ టికెట్స్ కి మంచి డిమాండ్ ఉంది. సోమ వారం వరకూ ఈ సినిమా టికెట్లు అమ్ముడు పోయాయి, వచ్చే వారం కూడా ఈ సినిమా టికెట్స్ డిమాండ్ ఇలానే కొనసాగేలా ఉంది. ప్రసాద్ మల్టీ ప్లేక్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఐమాక్స్ స్క్రీన్ టికెట్స్ హాండిల్ చెయ్యడం చాలా కష్టంగా ఉందని సమాచారం. ఈ సినిమా సీక్వెల్స్ కి ఇండియాలో మంచి పేరు ఉండడంతో, నిర్మాతలు ఈ సినిమాకి బిగ్ మార్కెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా కంటే ఒక వారం ముందే ఇండియాలో రిలీజ్ అవుతోంది, యుఎస్ లో ఈ సినిమా మే 3న విడుదలవుతోంది. షేన్ బ్లాక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గ్వైనెథ్ పాల్ట్రో, బెన్ కింగ్స్ లే, గై పియర్స్, డాన్ చీదెల్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు