IPL 2025 : Out Side Home 7 మ్యాచుల్లో 7 విజయాలతో చరిత్ర సృష్టించిన RCB – విజయవంతమైన సీజన్‌కు కారణాలు

IPL 2025 : Out Side Home 7 మ్యాచుల్లో 7 విజయాలతో చరిత్ర సృష్టించిన RCB – విజయవంతమైన సీజన్‌కు కారణాలు

Published on May 28, 2025 10:54 AM IST

RCB

Pic Courtesy : @IPL Twitter

ఈ సీజన్‌లో RCB (Royal Challengers Bengaluru) Out side home మ్యాచుల్లో అద్భుతంగా ఆడింది. మొత్తం 7 Out side home మ్యాచులు ఆడి అన్నింటిలోనూ గెలిచారు. చివరి మ్యాచులో Lucknow Super Giants (LSG) మీద 228 రన్స్ టార్గెట్‌ను 18.4 ఓవర్లలో చేజ్ చేసి, రికార్డు బ్రేక్ చేశారు.

RCB గెలిచిన Out Side Home మ్యాచులు

Chennai లో CSK మీద గెలుపు: 213 రన్స్ డిఫెండ్ చేసి, చివరి ఓవర్‌లో 2 రన్స్ తేడాతో గెలిచారు.

Mumbai లో MI మీద గెలుపు: 221 రన్స్ చేసి, 12 రన్స్ తేడాతో గెలిచారు.

Kolkata లో KKR మీద గెలుపు: Eden Gardens లో మంచి విజయం సాధించారు.

Jaipur లో RR మీద గెలుపు: 174 రన్స్ టార్గెట్‌ను 17.3 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో చేజ్ చేశారు.

Mullanpur లో PBKS మీద గెలుపు: Kohli అద్భుతంగా ఆడి, టార్గెట్ చేజ్ చేశారు.

Delhi లో DC మీద గెలుపు: బౌలర్లు, బ్యాటర్లు ఇద్దరూ బాగా ఆడి గెలిచారు.

Lucknow లో LSG మీద గెలుపు: 228 రన్స్ టార్గెట్‌ను 18.4 ఓవర్లలో చేజ్ చేసి, సీజన్‌లో 7వ Out side home గేమ్ గెలిచారు.

RCB బలాలు & ముఖ్యమైన ప్లేయర్స్

1. బ్యాటింగ్ పవర్

Virat Kohli: ఈ సీజన్‌లో RCB బ్యాటింగ్‌కు బలం. 13 మ్యాచుల్లో 602 రన్స్ చేశాడు, 8 ఫిఫ్టీలు.

Jitesh Sharma: Middle order లో ఫినిషర్‌గా బాగా ఆడాడు. LSG మీద 85* స్కోర్ చేశాడు.

Phil Salt & Rajat Patidar: Salt పవర్‌ఫుల్ స్టార్ట్ ఇస్తాడు, Patidar కంటిన్యూగా రన్స్ చేస్తాడు.

Middle order: Livingstone, Tim David, Jacob Bethell లాంటి ప్లేయర్స్ వలన బ్యాటింగ్ లో డెప్త్ వచ్చింది.

2. బౌలింగ్

Hazlewood & Bhuvneshwar Kumar: అనుభవం ఉన్న బౌలర్లు, ముఖ్యమైన టైమ్స్‌లో వికెట్లు తీసారు.

Yash Dayal: ముఖ్యమైన టైమ్స్‌లో బ్రేక్‌థ్రూ ఇచ్చాడు, ముఖ్యంగా CSK మీద చివరి ఓవర్‌లో.

Spin: Suyash Sharma, Krunal Pandya అవసరమైనప్పుడు బాగా బౌలింగ్ చేశారు.

3. లీడర్‌షిప్ & స్ట్రాటజీ

Rajat Patidar (Captain): కూల్ లీడర్‌షిప్, మంచి డెసిషన్స్ తీసుకున్నాడు. చివర్లో Patidar గాయంతో Jitesh Sharma కెప్టెన్ అయ్యాడు.

Auction స్ట్రాటజీ: కోర్ ప్లేయర్స్ రిటైన్ చేసి, కొత్త ఆటగాళ్ళను జత చేశారు.

టాక్టిక్స్ & మ్యాచుల విశ్లేషణ

చేసింగ్ లో సక్సెస్: RCB పెద్ద స్కోర్లు కూడా ధైర్యంగా చేజ్ చేసింది. చివరి Outside home మ్యాచులో 228 రన్స్ చేజ్ చేయడం దానికి ఉదాహరణ.

డెత్ బౌలింగ్: కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా , ముఖ్యమైన టైమ్స్‌లో బౌలర్లు ప్రెషర్ హ్యాండిల్ చేశారు.

స్క్వాడ్ డెప్త్: గాయాలు వచ్చినా, స్క్వాడ్ లో డెప్త్ వలన ఎఫెక్ట్ కాలేదు.

ఫైనల్ గా… ఈ సీజన్ RCB Out side home మ్యాచుల్లో అద్భుతంగా ఆడింది. Kohli ఫామ్, బ్యాటింగ్ డెప్త్, అనుభవం ఉన్న బౌలర్లు వలన RCB చాలా బలంగా ఉంది. ప్లేఆఫ్స్ లోకి టాప్-2 లోకి వెళ్లారు. ఇలాంటి ఫామ్ కొనసాగితే, ఈసారి IPL టైటిల్ గెలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు