మార్చి 21న ఇంటింటా అన్నమయ్య ఆడియో ఆవిష్కరణ

మార్చి 21న ఇంటింటా అన్నమయ్య ఆడియో ఆవిష్కరణ

Published on Mar 17, 2013 3:50 AM IST

Intinta-Annamayya

కే. రాఘవేంద్ర రావు గారి నూతన చిత్రం ‘ఇంటింటా అన్నమయ్య’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రాధాన పాత్రని నిర్మాత యెలమంచలి సాయిబాబు కొడుకు రేవంత్ పోషిస్తుండగా సనమ్ సెట్టి ప్రధాన నటీమణిగా కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలయింది. తాజా సమాచారం ప్రకారం దీని ఆడియో మార్చి 21న భారీ రీతిలో విశాఖపట్టణంలో జరగనుంది. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు వేల్ రికార్డ్స్ బ్యానర్ ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ‘శ్రీ రామరాజ్యాన్ని’ నిర్మించిన యెలమంచలి సాయిబాబే ఈ సినిమాకి నిర్మాత.ఈ సినిమా వేసవి తరువాత విడుదల కావచ్చు.

తాజా వార్తలు