ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ: దక్షి గుత్తికొండ – నిజానికి ఆర్జీవీ ఓ జెంటిల్ మెన్..!

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కరోనా వైరస్ మూవీలో హీరోయిన్ గా నటించింది, తెలుగు అమ్మాయి దక్షి గుత్తికొండ. మరి ఆర్ జి వి మూవీలో ఆఫర్ దక్కించుకున్న ఈ హీరోయిన్ ని మూవీ గురించి అనేక విషయాలు ఇంటర్వ్యూ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది..అవేమిటో చూద్దాం.

 

కరోనా వైరస్ మూవీలో నటించడానికి ఇబ్బందిపడ్డారా?

లేదు, పైగా ఆర్ జి వి లాంటి దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. అలాగే ఈ మూవీలో నటనకు ప్రాధాన్యం ఉన్న ఓ మంచి రోల్ చేస్తున్నాను.

 

లాక్ డౌన్ టైం లో మూవీ షూట్ చేశారు, భయం వేయలేదా?

లేదు, ఎందుకంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. టీమ్ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ షూట్ జరిగినప్పటికి కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది.

 

ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది?

కరోనా వైరస్ రైటర్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుండో తెలుసు. ఆయన నన్ను ఆర్జీవీ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆడిషన్స్ తరువాత ఈ మూవీకి నన్ను తీసుకున్నారు.

 

ఆర్జీవీ తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

ఎవరికైనా వర్మగారితో పనిచేయడం అనేది ఒక కల. చాలా మంది నన్ను ఆర్జీవీతో జాగ్రత్త అని భయపెట్టారు. నిజానికి ఆర్జీవీ ఓ జెంటిల్ మెన్, ఏ విషయంలో లైన్ క్రాస్ చేయరు. చాల సన్నివేశాల గురించి ఇంటి దగ్గర హోమ్ వర్క్ చేయమని చెప్పేవారు. ఆయన దగ్గర నేను అనేక విషయాలు నేర్చుకున్నాను.

 

మీ నేపథ్యం ఏమిటీ?

మాది విజయవాడ. హైదరాబాద్ మరియు బెంగుళూరులో పెరిగాను. ఇంటర్ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. తరువాత నటనపై ఆసక్తితో మోడలింగ్ చేయడం జరిగింది.

 

తెలుగు అమ్మాయిగా పరిశ్రమలో రాణించడం పై మీ అభిప్రాయం?

తెలుగు అమ్మాయిలను టాలీవుడ్ లో చులకనగా చూస్తారు. కేవలం ముంబై అమ్మాయిలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. అసలు అవకాశం ఇస్తే కదా తెలుగు అమ్మాయిలు కూడా ఎలాంటి పాత్ర అయినా చేయగలరని తెలిసేది.

 

బోల్డ్ రోల్స్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

పాత్ర డిమాండ్ మేరకు ఎలాంటి సన్నివేశాలలో నటించడానికైనా సిద్దమే. కాకపోతే కొన్ని పరిమితులు ఉంటాయి. కేవలం స్కిన్ షో కోసం అలా చేయమంటే కష్టం.

 

కరోనా వైరస్ మూవీ గురించి చెప్పండి?

ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని మూవీ చూడవచ్చు. రెండు గంటలు నిడివి కలిగిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతుంది.

Exit mobile version