నితిన్ తన తర్వాతి సినిమాగా ‘రంగ్ దే’ చేస్తున్నారు. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న ‘పవర్ పేట’ అనే సినిమా కూడా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. పైగా ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల ముసలాడిగా కూడా కనిపించబోతున్నాడు. మొత్తానికి ‘పవర్ పేట’ నితిన్ కెరీర్ కే స్పెషల్ ఫిల్మ్ గా నిలుస్తోందట.
కృష్ణ చైతన్య రాసుకున్న స్క్రిప్ట్ పెద్ద స్పాన్ ఉన్న కథ అని.. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ కథ 1960 – 2020 వరకూ నడుస్తోందట. అన్ని కుదిరితే డిసెంబర్ నుండి ‘పవర్ పేట’ షూటింగ్ ను మొదలుకానుంది. నితిన్ కెరీర్లో ఈ సినిమా మోస్ట్ యాంబీషియస్ సినిమా అవ్వనుంది.
ఇక ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని నితిన్ ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్న సంగతి తెలిసింది.