మహేష్, రాజమౌళి భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాపై అంచనాలు ఇపుడు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ని రాజమౌళి లేట్ గానే స్టార్ట్ చేసినప్పటికీ శరవేగంగానే పూర్తి చేసేస్తున్నారు.

ఇలా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. జక్కన్న ప్రస్తుతం మహేష్ మరియు ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. ఇక ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ టాకీ పార్ట్ తో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ ఈ కొంచెం గ్యాప్ లో కూడా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version