మహేష్ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. అయితే, లాక్ డౌన్ పొడిగింపు కారణంగా సినిమా ప్రారంభోత్సవం పై ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుండి, ఈ చిత్రం పై అనేక రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రాశారని అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని ఆ అప్ డేట్ సారాంశం.

ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ను విలన్ గా కన్నడ హీరో ఉపేంద్రను అనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది.

Exit mobile version