అజయ్ దేవగణ్ పాత్ర పై రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

అజయ్ దేవగణ్ పాత్ర పై రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on May 11, 2020 3:30 PM IST

ఈ లాక్ డౌన్ సమయంలో రాజమౌళి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా మీడియా ఇంటరాక్షన్ లో, అజేయ్ పాత్ర గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ది కీలక పాత్ర అని సినిమాలో బ్రేక్ పాయింట్ సమయంలో అజయ్ పాత్ర భారీ ప్రభావాన్ని చూపుతుందని రాజమౌలి చెప్పారు.

అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తారట. అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు