OG 11 రోజుల కలెక్షన్స్.. 2025లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్‌ను ఎలాగైతే చూడాలని అభిమానులు కోరుకున్నారో అలాగే చూపెట్టాడు దర్శకుడు సుజీత్. ఇక ఓజీతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాడు పవన్ కళ్యాణ్.

11 రోజుల ముగిసే సరికి ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.308 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీంతో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ వసూళ్లతో 2025లోనే హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా ఓజీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

పవన్ పవర్‌ఫుల్ యాక్షన్‌కు థమన్ సాలిడ్ సంగీతం అండగా నిలిచింది. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version