స్వీటీ పేరు వెనుక పూరి స్టోరీ

నిన్న టాలీవుడ్ ప్రిన్సెస్ అనుష్క శెట్టి 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే అనుష్కను వెండితెరకు పరిచయం చేసిన పూరి జగన్నాధ్ స్పీచ్ ప్రత్యేకంగా నిలిచింది. అనుష్కను ఎక్కడ ఎలా కలిసింది. సూపర్ సినిమాకు ఎలా ఎంపిక చేసింది చెప్పిన పూరి ఆమె పేరు వెనుక ఉన్న అసలు కథ చెప్పారు.

అందరూ ముద్దుగా పిలిచే స్వీటీనే అనుష్క అసలు పేరట. సూపర్ సినిమా హీరో నాగార్జున మంచి స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారట. దీనితో పూరి సూపర్ సినిమాలో ఓ పాట పాడటానికి వచ్చిన సింగర్ పేరు అనుష్క కావడంతో, ఆపేరును స్వీటీకి పెట్టాలని నిర్ణయించారట. అలా స్వీటీ కాస్త అనుష్క అయ్యారు. కాబట్టి స్వీటీకి అనుష్క గా నామకరణం చేసింది, డైనమిక్ డైరెక్టర్ పూరి గారేనట.

Exit mobile version