సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో దసరా కూడా అంతే ముఖ్యం. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని చాలా సినిమాలే సిద్దమవుతుండగా వాటిలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. అవే చిరు ‘ఆచార్య’, రజనీ
‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’. ఈ మూడు దసరా సీజన్లోనే విడుదలకానున్నాయి. కొరటాల శివ, చిరంజీవిల ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నా దసరాకు మాత్రం తప్పకుండా విడుదలవుతుందని తెలుస్తోంది.
అలాగే రజనీ, శివల సినిమా సైతం దసరా కానుకగా అక్టోబర్ 4వ వారంలో బరిలోకి దిగనుంది. ఇక ‘కె.జి.ఎఫ్ 2’ అయితే అక్టోబర్ 23న కన్ఫర్మ్ అయిపోయింది. వీటిలో రజనీ, యాష్ సినిమాలు తమిళం, కన్నడ భాషలతో సహా తెలుగులో భారీ ఎత్తున విడుదలవుతాయి. కాబట్టి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఉండనుంది. మూడు సినిమాల్లో ఏదీ చిన్నది కాకపోవడంతో ఈ పోటీ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.