ఓటిటిలో ‘బాహుబలి ది ఎపిక్’ ఎంట్రీ.. రీరిలీజ్ హైయెస్ట్ గ్రాసర్ ఎప్పుడు? ఎందులో చూడొచ్చు?

Baahubali The Epic

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఒక ఎపిక్ హిస్టారికల్ హిట్ గా ఇండియన్ సినిమా దగ్గర నిలిచింది. ఇలాంటి సెన్సేషనల్ రన్ ని అందుకున్న ఈ సినిమా రెండు భాగాలూ కలిపి ప్రతిష్టాత్మకంగా మేకర్స్ బాహుబలి ది ఎపిక్ గా రీరిలీజ్ కి తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా రీరిలీజ్ చిత్రాల్లో కూడా ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇక థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి కూడా సిద్ధం అయినట్టు బజ్ వినిపిస్తుంది. అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు ఎందులో చూడొచ్చు అనే ప్రశ్నలకి సమాధానం ఇదే. ఈ సినిమాని ఒరిజినల్ గా రెండు భాగాలు జియో హాట్ స్టార్ (ఒకప్పుడు హాట్ స్టార్) సొంతం చేసుకున్నారు. సో ఈ సింగిల్ పార్ట్ సినిమా హక్కులు కూడా వారి దగ్గరే ఉన్నాయట.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే హాట్ స్టార్ వద్ద కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలు హక్కులు ఉంటే బాహుబలి ది ఎపిక్ హిందీ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉన్నట్టు వినిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయానికి వస్తే రానున్న డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా ట్రీట్ ఇచ్చేందుకు వస్తుందని వినిపిస్తుంది. సో దీనిపై ఒక అఫీషియల్ క్లారిటీ అతి త్వరలోనే రానుంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా శోభు యార్లగడ్డ నిర్మాణం వహించారు.

Exit mobile version