
మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ చిత్రమే మాస్ జాతర. డీసెంట్ బజ్ నడుమ ఈ నవంబర్ 1న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో రాణించలేకపోయింది. ఇక ఈ తర్వాత ఓటిటి రిలీజ్ పరంగా కూడా పలు చిక్కులు ఎదుర్కొన్నట్టు టాక్ కూడా వచ్చింది.
మరి వీటిని దాటి ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఈ చిత్రం అందుకుంది. ఈ సినిమా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈ నవంబర్ 28 నుంచి హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో ఈ సినిమాని అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో ఇది రవితేజ అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.