నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమాని ప్రధాన పాన్ ఇండియా భాషలు తెలుగు, హిందీ, తమిళ్ అలాగే కన్నడ, మలయాళ భాషల్లో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఓటిటిలోకి వచ్చాక ఫస్ట్ పార్ట్ కి పాన్ ఇండియా లెవెల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పార్ట్ 2 ని వారి అందరికి థియేట్రికల్ గా దగ్గర అయ్యే విధంగా ఈ సినిమాని తీసుకొస్తున్నారు. కానీ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 కి ఈ భాషల్లోనే కాకుండా ఏ తెలుగు సినిమా ఇప్పుడు వరకు చేయని అవాధీ భాషలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ భాషని ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ అలానే బీహార్, ఇంకా ఢిల్లీ లలో కొన్ని ప్రాంతాల్లో మాట్లాడేవారు ఉన్నారట. వారికి కూడా అర్ధం అయ్యే విధంగా ‘అఖండ 2’ రానున్నట్టు ఇపుడు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
