ఇండియన్ సినిమాకు 1000కోట్లు వచ్చే అవకాశం ఉంది – కమల్ హాసన్

ఇండియన్ సినిమాకు 1000కోట్లు వచ్చే అవకాశం ఉంది – కమల్ హాసన్

Published on Nov 6, 2013 8:42 AM IST

Kamal_Haasan

సినిమా స్టార్స్, నిర్మాణ సంస్థలు మీడియా వారు ఒక సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరితేనే చాలా సంతోషంగా ఉంటారు. అందులో కొన్ని 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తే మరీ ఆనందం, అలా కొన్ని సినిమాలు మాత్రమే 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి.

కానీ ప్రస్తుతం ఒక ఇండియన్ యాక్టర్ వీటన్నిటికీ దూరంగా, ఎవరూ ఊహించని ఓ నెంబర్ వస్తుందా అని అంటున్నాడు. ఇండియన్ సినిమాకి 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నాడు. ఈ మాటలు అన్నది మరెవరో కాదు మన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారే..

ఈ 1000 కోట్ల క్లబ్ లో మన ఇండియన్ సినిమా కూడా చేరడానికి కమల్ హాసన్ ఓ సింపుల్ లాజిక్ చెబుతున్నారు. ‘ ప్రస్తుతం మనదేశ జనాభా 100 కోట్లపైనే. అందులో కేవలం 10% మంది సినిమా చూస్తే ప్రస్తుతం ఉన్న టికెట్ రెట్ల ప్రకారం మనం 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయవచ్చని’ కమల్ అంటున్నారు.

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆదాయ విధానంలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. ‘మేము ఈ పారదర్శకత గురించి తెలుసు కున్నప్పటికీ ఆ విషయం పై ముందుకెళ్ళలేదు. ఇది ఎలాంటిదంటే ఒక గిన్నె మొత్తం హోల్స్ ఉంటే మనం ఎన్ని నీళ్ళు పోసి దాన్లో చేయాలనుకున్నా నిలవవని’ ఆయన అన్నారు.

ఈ టాలెంటెడ్ హీరో సౌత్ ఇండియన్ సినిమా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని, దానికి ముందు ముందు మంచి రోజులు వస్తాయని తెలిపారు. తాజాగా బెంగుళూరు లో జరిగిన ఓ ఈవెంట్ లో కమల్ హసన్ ఈ విషయాల్ని తెలియబరిచారు.

తాజా వార్తలు