ICC Champions Trophy Final : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ అద్భుత విజయం!

మన దేశపు జనాభాకి ఉన్న అతి పెద్ద ఎమోషన్స్ లో సినిమాతో పాటుగా క్రికెట్ కూడా ఒకటి. మరి ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎలాగైనా సరే భారత్ ఛాంపియన్ గా నిలవాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. ఇలా జరిగిన లేటెస్ట్ ఫైనల్స్ లో భారత జట్టు హిస్టారికల్ విజయాన్ని నమోదు చేసింది.

దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఈ ఫైనల్స్ లో న్యూజిలాండ్ నిర్దేశించిన 251 లక్ష్యాన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఒకింత సస్పెన్స్ తో కూడా సాలిడ్ విజయాన్ని భారత జట్టు నమోదు చేసింది. మెయిన్ గా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే శ్రేయాస్ అయ్యర్, కీలక పరిస్థితుల్లో హార్దిక్ పాండ్య సహా కే ఎల్ రాహుల్ లు అందించిన నాక్ భారత జట్టు విజయానికి దోహదపడింది.

ఇక లాస్ట్ లో వచ్చిన జడేజా కీలక డబుల్స్ తీసి ఫైనల్ షాట్ గా ఫోర్ తో ముగించి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత జట్టు న్యూజిలాండ్ ని ఓడించి కొత్త ఛాంపియన్స్ గా నిలిచి భారత్ కి ఒక చారిత్రాత్మిక విజయాన్ని అందించి ప్రతీ ఒక్క భారతీయుని కళ్ళలో ఆనందాన్ని నింపింది. ఇక ఈ విజయంతో భారత్ కి మూడో ఐసీసీ కప్ అందుకోగా సినిమా ప్రముఖులు కూడా భారత జట్టుకి అభినందనలు తెలుపుతున్నారు.

Exit mobile version