భారీ విడుదలకు సిద్దమవుతున్న బాండ్ చిత్రం

భారీ విడుదలకు సిద్దమవుతున్న బాండ్ చిత్రం

Published on Oct 30, 2012 8:47 PM IST


హాలివుడ్ చరిత్రలో మిగిలిపోయే పాత్రలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జేమ్స్ బాండ్ గురించి. ప్రపంచమంతట ఈ పాత్రకు అభిమానులు ఉన్నారు భారతదేశంలో కూడా ఈ పాత్రకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయిపోయాడు. “స్కై ఫాల్” చిత్రం ఇండియాలో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్,హిందీ,తమిళ్ తెలుగు భాషల్లో విడుదల కానుంది. డానియల్ క్రేగ్ ఈ చిత్రంలో మూడవసారి జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించనున్నారు. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్లో ఇది 23వ చిత్రం. ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల అవుతున్న అన్ని థియేటర్లలో టికెట్లు హాట్ కేక్ లా అమ్ముడుపోతున్నాయి. ఈ చిత్రం అంచనాలను అందుకున్తుందా లేదా అన్నది విడుదల తరువాతే తెలుస్తుంది.

తాజా వార్తలు