స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఈ ఏడాది బాక్సాఫీస్ ను అదరగొట్టిన చిత్రం “అల వైకుంఠపురములో”. అంచనాలకు మించిన హిట్ కావడంతో బన్నీ హిట్ రీసౌండ్ గట్టిగానే వినిపించింది.
దీనితో ఈ చిత్రం టాలీవుడ్ లోనే నా బాహుబలి రికార్డులను సెట్ చేసి బన్నీ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. అయితే ఆ కొద్ది లోనే కరోనా దేశ వ్యాప్తంగా కల్లోలం రేపడంతో ఈ ఎన్నో సినిమాల విడుదలలు ఆగిపోయాయి థియేటర్లు మూతపడ్డాయి. కానీ ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లు తెరుచుకోడానికి అనుమతులు లభించాయి.
కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్స్ తెరిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏపీలో మొట్టమొదటిగా బన్నీ బొమ్మే పడనున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే బెంగళూర్ లో మొదటిగా ఈ చిత్రాన్నే ఈరోజు షోకు తీసుకొచ్చారు.
అలాగే మన దగ్గర ఏపీ విశాఖ జిల్లాలో పడనున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్లే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ఈ అక్టోబర్ 16 నే షో వెయ్యనున్నట్టుగా తెలుస్తుంది.దీనితో బన్నీ ఫ్యాన్స్ ఈ విషయంపైనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ రెండు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.