గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ సినిమానే ”గేమ్ ఛేంజర్”. మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేసిన ఈ సోషల్ డ్రామా దారుణంగా మిస్ ఫైర్ అయ్యింది. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే బాగా ఆలస్యం కావడంతో ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా తక్కువ ఓపెనింగ్స్ నే అందుకుంది.
అయితే మన స్టార్స్ సినిమాలకి ఏమైందో కానీ ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో చాలా తక్కువ ప్రీమియర్స్ నే పెడుతున్నాయి. ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ తగ్గడమో లేక బాగా ఆలస్యం అయ్యిన ప్రాజెక్ట్ లు అనో కొన్ని సినిమాలకి వరస్ట్ మూమెంట్ కనిపించింది. కానీ ఇలాంటి సమయంలో కూడా కొద్దో గొప్పో గేమ్ ఛేంజర్ కే మంచి ప్రీసేల్స్ దక్కినట్టు ఉన్నాయని చెప్పాలి.
రీసెంట్ గా హరిహర వీరమల్లు, ఇప్పుడు రాబోతున్న వార్ 2 సినిమాలు ప్రీమియర్స్ ఓ వారం సమయం ఉండగా వసూళ్లు చూసుకుంటే వీటికంటే చాలా బెటర్ గా గేమ్ ఛేంజర్ వసూళ్లు ఉన్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ కి 3 లక్షలకి పైగా గ్రాస్ ఉంటే మిగతా భారీ సినిమాకి 2 లక్షల మార్క్ కూడా యూఎస్ మార్కెట్ లో దాటనట్టే తెలుస్తుంది. సో ఇంత వరస్ట్ మూమెంట్ లో కూడా బెస్ట్ గా గేమ్ ఛేంజర్ నిలవడం విశేషం.