‘అలా మొదలైంది’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన నిత్యా మీనన్ వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ అది తెలయడానికి చాలా రోజులు టైం పట్టింది. తను ఎంచుకున్న కొన్ని దారుల వల్ల తనకి బాగా యారగెంట్ అని పెరోచ్చించి. అందుకే తను సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటోంది. అలాగే తను గ్లామరస్ పాత్రలకి సెట్ కానని ఒప్పుకోవడానికి తానెం మొహమాటం పడటం లేదు.
నిత్యా మీనన్ తను యారగెంట్ అని చెబుతున్న వార్తల్ని పూర్తిగా ఖండించింది. ‘నేను యారగెంట్ కాదు. నాతో మంచిగా ఉన్నవాళ్ళకి నేను చాలా మంచి దాన్ని. ఎవరైతే నాతో మిస్ బిహేవ్ చేస్తారో లేదా నాతో లిమిట్స్ క్రాస్ చేస్తారో వాళ్ళందరికీ నేను చెడ్డదానిలానే కనిపిస్తాను. అందుకే ఏమో చాలామంది యారగెంట్ అంటారు. కానీ మీరు నాతో పనిచేసిన ఎవరిని అడిగినా చెప్తారు నేను యారగెంట్ ఆ కాదాఅని’ తెలుస్తుందని నిత్యా చెప్పింది.
నిత్యా మీనన్ త్వరలోనే శ్రీప్రియ దర్శకత్వంలో రానున్న మాలిని 22 సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో నిత్యా మీనన్ రేప్ కి గురైన బాదితురాలుగా న్యాయం కోసం పోరాడే యువతిగా కనిపించనుంది. ఇది కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.