యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – సునీల్ హీరోలుగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘తడాఖా’ గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, సునీల్, బెల్లంకొండ సురేష్, థమన్, బెల్లంకొండ గణేష్ బాబు, డాలీ, శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
సునీల్ మాట్లాడుతూ ‘ ముందుగా అనుకున్నట్టుగానే సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ కా కనిపించి, సెకండాఫ్ లో సీరియస్ గా కనిపించే రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. అలాగే ఇన్ని రోజులు నాగ చైతన్య గారిని సాఫ్ట్ గా చూసాను, నాగార్జున గారి ‘శివ’ సినిమాలో లా మాస్ పాత్ర ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నాను. ఈ సినిమాలో చైతు గారిలోని మాస్ హీరోని బాగా ఎలివేట్ చేసారు. ఫ్రీమేక్ లు చేస్తున్న రోజుల్లో పర్ఫెక్ట్ గా రీమేక్ రైట్స్ కొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసారు. ఎన్నో రోజులనుంచి థమన్ మ్యూజిక్ కి స్టెప్పులేయాలనుకుంటున్నా అది ఈ సినిమాతో నెరవేరిందని’ అన్నాడు
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళి ఈ రోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఏకైక కారణం నాగార్జున గారు, సునీల్ పాత్ర కొన్ని చోట్ల చైతు పాత్రని డామినేట్ చేస్తుందన్నా పర్లేదు అని చెప్పి ఈ సినిమాకి ఓకే చెప్పారు. నా బ్యానర్ లో వచ్చిన సినిమాతో డాలీ మాస్ డైరెక్టర్స్ లో ఒకడుగా చేరిపోవడం చాలా సంతోషంగా ఉందని’ అన్నాడు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘ ముందుగా సినిమాని ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ చేసిన అక్కినేని ఫాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. బెల్లంకొండ గారు నాకు సెకండ్ బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ పోయి మాస్ హీరో ఇమేజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని’ అన్నాడు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ డాలీ, శ్రీనివాస్ రెడ్డి, తమన్ లు కూడా సినిమా విజయం సాధించినందుకు తమ సంతోషాన్ని పంచుకున్నారు.